Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2017 11:06:19
facebook Twitter Googleplus
Photo

కొన్ని రోజుల ముందు వరకు నెగెటివ్ విషయాలు వినిపించాయి కానీ.. విడుదల తేదీ దగ్గరికొచ్చే సరికి సీన్ మారుతోంది. మొన్నటి ఆడియో వేడుకలో మురుగదాస్.. మహేష్ బాబు సహా అందరూ ఈ సినిమా గురించి చెప్పిన మాటలు.. పాటలు.. వాటి ప్రోమోలు స్పైడర్ మీద ఇప్పటికే ఉన్న అంచనాల్ని పెంచాయి. మామూలుగా తన సినిమాల గురించి ముందే ఎక్కువగా చెప్పుకోని మురుగదాస్.. ఈ చిత్రం స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని.. అందుకు మహేష్ బాబుకు కంగ్రాట్స్ చెబుతున్నానని వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాబట్టి స్పైడర్ అంత తేలికైన సినిమా కాదని భావించవచ్చు. స్పైడర్ కు జరిగిన బిజినెస్ లెక్కలు చూస్తే.. దీనిపై ట్రేడ్ వర్గాల్లో కూడా ఏ స్థాయి అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక స్పైడర్ రిలీజ్ డేట్ విషయంలో చాలా ముందుగానే పక్కా ప్రణాళిక రచించింది చిత్ర బృందం. దసరా సెలవులు కావడంతో బుధవారమే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్ణయించారు. పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ఐదు రోజుల పాటు సినిమా దున్నేసుకోవడం ఖాయం. మామూలుగానే మహేష్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. పైగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక పాజిటివ్ టాక్ కూడా వచ్చిందంటే.. వీకెండ్లో కళ్లు చెదిరే బాక్సాఫీస్ నంబర్స్ చూడొచ్చు. రెండు భాషల్లో విడుదలవుతున్న సినిమా కాబట్టి.. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సౌత్ ఇండియాలో నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలైనా ఆశ్చర్యం లేదు.

,  ,  ,  ,  ,