Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2017 15:22:28
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు లేటెస్ట్ సినిమా స్పైడర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో ఈ సినిమా షూటింగేమో అనుకున్నా టైం కన్నా బాగా డిలే అయింది. కనీసం మహేష్ పుట్టిన రోజుకయినా వస్తుందని ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. కాకుంటే పుట్టినరోజు నాటికి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ పాత రికార్డులన్నింటినీ బద్దలుకొట్టింది.

‘‘స్పైడర్ టీజర్ విడుదలైన 24 గంటల్లో ఆన్ లైన్ లో 8.6 మిలియన్ హిట్లు వచ్చాయి. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ మూవీ డిజిటల్ విభాగం ఓ ట్వీట్ పెట్టింది. భయపెట్టడం మాకూ వచ్చు అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. సోషల్ ట్రెండింగ్ లిస్టులో కూడా ఈ టీజరే టాప్ లో ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ హీరో ఎస్.జె.సూర్య తొలిసారి విలన్ గా చేస్తున్నాడు. ఈ మూవీ థియేటరికల్ ట్రయిలర్ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలవనుంది.

స్పైడర్ మూవీకి హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ ఆడియో ఇంకా రిలీజ్ అవనప్పటికీ బూమ్ బూమ్ అనే పాట ఒక్కటీ లాంచ్ చేశారు. ఈ పాట జనాల నోళ్లలో బాగానే హమ్ అవుతోంది.

,  ,  ,  ,  ,  ,