Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2017 11:23:22
facebook Twitter Googleplus
Photo

స్పైడర్ కోసం తెలుగు ప్రేక్షకులు చాల ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేది విషయం పై కొద్ది రోజులగా అందరిలో ఒక ఉత్కంఠ నెలకొంది. చివరకు అధికారకంగా ఒక తేది చెప్పడంతో ఊపిరి పీలుచుకున్నారు అభిమానులు. సినిమా విడుదల కాకముందే తమిళ్ థియేటర్ల రైట్స్ పెద్ద మొత్తంలో కొనుగులు జరిగి ఒక రికార్డు క్రియేట్ చేసింది స్పైడర్. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్లో మరొక సరికొత్త రికార్డు ఒకటి నెలకొల్పింది స్పైడర్ సినిమా.

స్పైడర్ మూవీ అధికారిక యూట్యూబ్ చానల్ ను సుమారుగా 100000 మంది సబ్ స్ర్కైబ్ చేసుకున్నారు. కేవలం కొన్ని వందలమందే తక్కువ అంతే. సినిమా టీజర్ కూడా ఇంకా విడుదల కాలేదు అయిఆన ఇంత మంది ఆ ఛానల్ ను ఫాలో అవుతుండటం టాలీవుడ్ యుట్యూబ్ హిస్టరిలో ఒక పెద్ద వింత. కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఉన్నవి వీడియొగా చేసి గ్లిమ్స్ ఆఫ్ స్పైడర్ అనే ఒక వీడియొను విడుదల చేశారు. దీన్ని కొన్ని లక్షలు మంది చూశారు అతి కొద్ది సమయంలో. ఇది కూడా ఒక రికార్డు అనే చెప్పుకోవాలి. స్పైడర్ సినిమా పై ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయో ఈ నెంబర్లను చూస్తే చెప్పొచ్చేమో.

ఇకపోతే సినిమా విషయానికి వస్తే.. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ పనులు ఇప్పటికే ట్రాక్లో వేగంగానే నడుస్తున్నాయి. చివరిగా స్పైడర్ టీమ్ మళ్ళీ ఒక పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. జూలై 5 నుండి జూలై 8 వరకు రామోజీ ఫిల్మ్ సిటీ లో మిగిలిపోయిన పాటను షూట్ చేసి షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పేస్తారట.

,  ,  ,  ,  ,