Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Aug-2017 11:00:41
facebook Twitter Googleplus
Photo

హీరోలు విలన్ లుగా మారే ట్రెండ్ ఇప్పుడు బాగానే ఊపందుకుంటోంది. జగపతి బాబు తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ ఇప్పుడు విలన్ గా మారిపోతోన్నాడనే సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఇప్పుడు విలన్ గా మారుతున్నాడనే మాట నిజమే కానీ.. వాస్తవానికి శ్రీకాంత్ కెరీర్ మొదలైందే నెగిటివ్ పాత్రలతో అనే విషయం మర్చిపోకూడదు.

ఆ సంగతలా ఉంచితే.. ఇప్పుడు శ్రీకాంత్ విలన్ గా రీఎంట్రీ ఇస్తున్న మూవీ యుద్ధం శరణం. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. కానీ ఈ టీజర్ లో స్పెషల్ అంటే మాత్రం శ్రీకాంత్ నే చెప్పుకోవాలి. సహజంగా హీరో ఓరియెంటెడ్ గా టీజర్స్ ఉంటాయి. హీరోయిజం ఎలివేషన్ కూడా అలాగే ఉంటుంది. కానీ యుద్ధం శరణం టీజర్ లో మాత్రం.. కథ రివర్స్ లో ఉంది. విలన్ శ్రీకాంత్ ను చూపించడం కోసం.. నిమిషం టీజర్ ను కట్ చేసినట్లుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

ఆఖరులో క్రౌర్యంగా కనిపించే శ్రీకాంత్ ఫేస్ చూస్తే.. వామ్మో అని భయపెట్టేయక మానదు. ఎప్పుడో దశాబ్దాల క్రితమే వదిలేసిన నెగిటివ్ పాత్రలో.. మరింత పరిణతితో కనిపించాడు శ్రీకాంత్.

,  ,  ,  ,  ,  ,