Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2017 10:27:51
facebook Twitter Googleplus
Photo

యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ కు ఇప్పటిదాకా టాలీవుడ్లో క్లీన్ ఇమేజ్ ఉంది. నటుడిగానే కాక తన స్వీయ దర్శకత్వంలో చేసిన సినిమాతోనూ క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నాడతను. అలాంటి వాడు.. బాలీవుడ్ అడల్ట్ కామెడీ హంటర్ రీమేక్ లో హీరోగా నటించడం.. అందులో సెక్స్ అడిక్ట్ క్యారెక్టర్ చేయడం.. హాట్ హాట్ సన్నివేశాలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అవసరాల ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నాడో అన్న సందేహాలు రేకెత్తాయి. ఈ సందేహాలకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు అవసరాల.

హంటర్ ఒక నిజాయితీ ఉన్న సినిమా. అందుకే దీని రీమేక్ ‘బాబు బాగా బిజీ’లో నటించడానికి ఒప్పుకున్నా. మన జీవితాల్లో జరిగేదే అందులో చూపిస్తున్నాం. దీన్ని బూతుగా భావించాల్సిన అవసరం లేదు. ఈ పాత్ర చేసినందుకు నాకేమీ రిగ్రెట్స్ లేవు. అంతా ఆలోచించుకునే ఈ సినిమా చేశా. బాబు బాగా బిజీ లో నీ కౌంట్ ఎంత అంటే వంద అంటాను. దాన్ని చూసి నిజ జీవితంలోనూ నన్ను అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. తెరమీద ఎవరైనా 40 మందిని చంపారనుకోండి. వాళ్లు నిజ జీవితంలోనూ హత్యలు చేస్తారా? మరి బాబు బాగా బిజీ లాంటి సినిమాలు చేసినంత మాత్రాన నిజ జీవితంలోననూ అలాగే ఉంటామా? పాత్రకు తగ్గట్లు నటించడం.. కనిపించడం అవసరం.

,  ,  ,  ,  ,