Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Dec-2017 11:48:43
facebook Twitter Googleplus
Photo

నాని ప్రస్తుతం MCA రిలీజ్ మూడ్ లోకి ఇంకా అంతా కరెక్ట్ గా రాలేదు. కానీ తన ప్రొడక్షన్లో వస్తోన్న అ! సినిమాని మాత్రం జనాల్లోకి బాగా ఎక్కిస్తున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలాగైనా అందరికి కనెక్ట్ అవుతాడు అని ఓ నమ్మకం అయితే ఉన్నట్టు ఉంది. అలాగే ఆడియెన్స్ కూడా సినిమాను ఎలాగైనా చూస్తారు. ఎందుకంటే ఈ మూడు నెలల్లో రిలీజ్ అయిన సినిమాలు ఏవి అంతగా మెప్పించ లేకపోయాయి.

సో..తప్పకుండా MCA అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ కూడా చాలా నమ్మకంతో ఉంది. పైగా దిల్ రాజు నిర్మాణంలో కాబట్టి ప్రమోషన్స్ రిలీజ్ వంటి పనులు హై రేంజ్ లో ఉండనే ఉంటాయి. అంతే కాకుండా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నానితో జోడి కట్టడం వంటి కారణాలు ఎలాగైనా సినిమాకి ప్లస్ పాయింట్. సో మనోడి ఏకాగ్రత మొత్తం ఇప్పుడు అ! సినిమాపైనే ఉంది. మొదటి సారి ఒక సినిమాను తన పేరు మీద వస్తుండడంతో ప్రమోషన్స్ ని కూడా హై రేంజ్ లో చేస్తున్నాడు. అ! సినిమాలో ఎంత మంది తారలు నటిస్తున్నారో అందరికి తెలిసిందే.

ఇకపోతే మొన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఈ రోజు శ్రీనివాస్ అవసరాల డిఫెరెంట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ మల్టి టాలెంటెడ్ పర్సన్ ని చూస్తుంటే.. కొంచెం కొత్తగా ఉన్నా.. అచ్చం కోలీవుడ్ స్టార్ సూర్యాని గుర్తు చేసున్నాడు అనిపిస్తోంది. ఎందుకంటే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన 24 సినిమాలో సూర్యా ఇదే లుక్ తో ఉంటాడు. టైమ్ మిషెన్ ని చెక్ చేసున్నట్లు పోస్టర్ చెప్పకనే చెబుతోంది.

,  ,  ,  ,  ,