Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2015 14:57:40
facebook Twitter Googleplus
Photo

శ్రీనూ వైట్లకి సెంటిమెంటు ఎక్కువ. తన సినిమాల్లో హీరో ఖాకీ చొక్కా వేయనిదే హిట్టు రాదని అనుకుంటాడేమో! అందుకే అతడు ఏ సినిమా తీసినా హీరో పోలీస్ క్యారెక్టరే. ఇటీవలి కాలంలో అతడి వరుస చూస్తుంటే ప్రేక్షకదేవుళ్లకు ఒకటే వెగటు పుట్టే పరిస్థితి. ఎప్పుడూ మూసలో కొట్టుకుపోతూ ఒకే క్యారెక్టర్ని పదే పదే తెరపై చూపించడం దానికి మన హీరోలు కూడా అంగీకరించడం అంతా విడ్డూరంగా ఉందన్న విమర్శలొస్తున్నాయి. అయినా శ్రీనూ మారేది ఎప్పుడు? ఎప్పటికీ మారడా? అన్న సందేహాలు జనాల్ని పట్టి పీడిస్తున్నాయి. సినిమా సర్కిల్స్ లో అయితే శ్రీనూ ఆడుతున్న సేఫ్ గేమ్ ఫార్ములా గురించి ఒకటే జోకులు.

అప్పట్లో మహేష్ ని దూకుడు చిత్రంలో కాప్ పాత్రలో చూపించాడు. రియాలిటీ షో మాటున పోలీస్ గా మహేష్ ని చూపించాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ ని కూడా బాద్ షా చిత్రంలో అండర్ కాప్ గా ఆవిష్కరించాడు. వెనువెంటనే మహేష్ ని ఆగడు చిత్రంలో మాస్ పోలీస్ గా చూపించాడు. అయితే ఈ కాప్ స్టోరీలు అక్కడితో ఆగిపోలేదు. బ్రూస్ లీ లోనూ చరణ్ని మరో పోలీస్ గానే చూపించాడు. ఏదో స్టంట్ మ్యాన్ అని కవర్ చేశాడు కాని.. మనోడు ఎక్కువగా పోలీస్ అనే భ్రమనే క్రియేట్ చేశాడు. అయితే ఇలా రొటీన్ పోలీస్ క్యారెక్టర్లతో విసుగు తెప్పించేస్తున్నాడు శ్రీనూ. అతడిని చూస్తుంటే సేఫ్ సైడ్ కోసం అలా రొటీన్ క్యారెక్టర్ల వెంట పడుతున్నాడా? లేక వేరే కొత్త ఐడియాలు ఏవీ అతడికి రావా? కథలు రాసుకోవడంలో అతడిలో క్రియేటివిటీ కాకెత్తుకెళ్లిందా? అన్న సందేహాలొస్తున్నాయి. వీటన్నిటికీ శ్రీనూ సమాధానం ఎప్పుడు చెబుతాడో?

,  ,  ,