Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Aug-2017 15:27:15
facebook Twitter Googleplus
Photo

సుకుమార్-అల్లు అర్జున్ బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ల కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఇద్దరి కెరీర్లనూ నిలబెట్టింది. తర్వాత ఈ కాంబినేషన్లో ఆర్య-2 వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. వీళ్లిద్దరి మధ్య అనుబంధం మాత్రం కొనసాగుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీతో తన అనుబంధం గురించి పంచుకున్నాడు సుకుమార్. తనను బన్నీ మట్టపర్రోడా అని వెక్కిరిస్తుంటాడని సుకుమార్ వెల్లడించాడు.

అందుకు కారణమేంటో చెబుతూ.. మా ఊరి పేరు మట్టపర్రు. అది ఒక మారు మూల గ్రామం. ఆ ఊరికి బస్సు ఉండదు. ఇప్పటికీ బస్సు లేదు. రోడ్డు కూడా సరిగా ఉండదు. ఒకసారి మా ఊరికి బన్నీని తీసుకెళ్లా. అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి ఊరి నుంచి వచ్చి ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నావా అన్నాడు. నన్ను అప్పుడప్పుడూ మట్టపర్రోడా అని వెక్కిరిస్తుంటాడు. నేను పాతికేళ్ల పాటు ఆ ఊర్లోనే ఉన్నా. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగా. ఆ వాసనలు.. ఆ అలవాట్లు ఇంకా నన్ను వదిలి పోలేదు.

నేను ఇప్పటికీ కిందే పడుకుంటా. ‘1 నేనొక్కడినే’ షూటింగ్ కోసం లండన్ వెళ్లినపుడు హోటల్ వాళ్లకు చెప్పి కాట్స్ తీయించేశా. మా ఇంట్లో అన్ని లగ్జరీస్ ఉన్నప్పటికీ కిందే పడుకుంటా. నేనెక్కడి నుంచి వచ్చానో ఆ నేపథ్యంతో సినిమా తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కానీ కుదర్లేదు. లండన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేస్తూ పోయా. కానీ ఒక దశలో దీనికి ఫుల్ స్టాప్ వేయాల్సిందే అని ఫిక్సయి.. బ్రేక్ వేసేశాను. రంగస్థలం సినిమా మొదలుపెట్టాను.

,  ,  ,  ,