Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2015 13:05:21
facebook Twitter Googleplus
Photo

సుకుమార్ అంటే విషయం ఉన్న డైరక్టర్ అనేది చాలామంది నమ్మకం. ఎందుకంటే మనోడి సినిమా బాక్సాఫీస్ సక్సెస్ ఎలా ఉన్నప్పటికీ వాటిలో కంటెంట్ మాత్రం ఎక్కడో కాస్త టచ్చింగ్ గానే ఉంటుంది. అందుకే ఇతగాడికి చాలామంది అభిమానులు ఫేసుబుక్కుల్లో గుళ్లు కట్టేస్తుంటారు.

నిన్న రిలీజైన కుమారి 21 ఎఫ్ సినిమాకు కర్త - కర్మ - క్రియ మన సుక్కూ సారే. కంటెంట్ బోల్డ్ అంటే బోల్డ్ కాదు.. ఏకంగా బోల్డున్నర. ఆ రేంజులో రాసేశాడు. అసలు హద్దులే లేకుండా చాలా ఫ్యాంటసీలను వెండితెర మీద ఆవిష్కరించమని తన అనుచరుడిని దింపాడు. అద్దాల్లో ప్రియుడికి అందాలను చూపించడం నుండి.. కండోమ్ లు కొనివ్వడం వరకు.. పిచ్చెత్తించాడు. కాని ఇంటెలిజెంట్ సినిమాను చూస్తాం అనుకునేసరికి కాస్త ఎడల్ట్ డోస్ తగిలితే ఎలా ఉంటుంది? మ్యాథ్స్ క్లాసుకు ప్రేమతో వస్తే.. అక్కడ శిల్పకళ నేర్పిస్తామంటూ ఒక మోడల్ సెమీ న్యూడ్ గా కూర్చున్నట్లు ఉంటుంది. బయటకు వెళ్లలేం.. అలాగని అక్కడే ఉండలేం.

ఇప్పుడందరికీ ఒకటే డౌటు. బాబూ సుక్కూ.. ఎన్టీఆర్ సినిమాలలో కూడా ఇలాంటి ప్రయోగాలేవైనా చేస్తున్నావా అని.. తారక్ తో తీస్తున్న నాన్నకు ప్రేమతో సినిమాలో ఇలా ఏదన్నా ఎడల్టు డోస్ ఇస్తే మాత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్ కు షార్టు సర్క్యుట్ అయితే.. ఫ్యాన్సుకు ఫీజ్ కొట్టేస్తుంది.

,  ,  ,  ,