Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Oct-2015 17:26:50
facebook Twitter Googleplus
Photo

లవ్ స్టోరీ అన్నాక ప్రేమలు - అపార్ధాలే కాదు.. కాసిన్ని చిందులు కూడా వేయాలి. అసలే.. నన్ను ప్రేమించడానికి వయసు ఏజ్ సరిపోదా అనే కుమారిని లైన్ లో పెట్టడమంటే మాటలా.. చాలా కష్టం. ఎన్నో పాట్లు పడాలి. మరెన్నో ఫీట్లు చేయాలి. హెబ్బాపటేల్ కోసం అలాంటి డ్యాన్సులే వేస్తున్నాడు కుర్ర హీరో రాజ్ తరుణ్.

సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే అందించిన కుమారి 21ఎఫ్ చిత్రం కోసం ప్రస్తుతం ఓ సాంగ్ ని పిక్చరైజ్ చేస్తున్నారు. ఆ పాటకోసమే రాజ్ తరుణ్ డ్యాన్సులు వేస్తున్నాడు. అందాల భామలను చుట్టూతా వేసుకుని.. భలే ముచ్చటగా ఉన్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై చాలానే అంచనాలున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు కుమారి 21ఎఫ్ కి. అందుకే రేపు 31న విడుదలయ్యే ఆడియో కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ఇంతవరకు కేవలం ఓ క్యూట్ ఫ్యామిలీ బాయ్ గా మార్కులు కొట్టేసిన రాజ్ తరుణ్.. ఇప్పుడీ సినిమాతో క్లాస్ లవర్ గా మారిపోతాడని టాక్. ఇప్పటికే సినిమా చూపిస్త మావ సినిమాతో మాస్ లవర్ గా మారిన ఈ పిల్లాడు మరి ఇప్పుడెంత మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

,  ,  ,