Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Dec-2017 10:54:24
facebook Twitter Googleplus
Photo

ఎన్నో సినిమాలు చేసినా రాని గొప్ప కాంప్లిమెంట్ తాజాగా నటించిన మళ్లీ రావా సినిమాతో తనకు లభించిందని ఆనంద పడిపోతున్నాడు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్. గోదావరి.. సత్యం లాంటి ఫీల్ గుడ్ ఫిలిమ్స్ తో ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడు ఈ మధ్య చాలాకాలం పాటు వెండితెరపై కనిపించలేదు. ఈమధ్య బాలీవుడ్ మూవీ విక్కీ డోనర్ రీమేక్ నరుడా.. డోనరుడాతో రీ ఎంట్రీ ఇచ్చి తాజాగా మళ్లీ రావా తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

మళ్లీ రావా టెస్ట్ షో వేసినప్పుడు ఓ మూల కూర్చుని ఉన్నా. సినిమా అయిన తర్వాత మా సిస్టర్ కంటినిండా నీటితో నా దగ్గరకు వచ్చి హత్తుకుని అభినందించింది. నా జీవితంలో నేను అందుకున్న గొప్ప కాంప్లిమెంట్ అది. సాధారణంగా తనకు సినిమా నచ్చలేదంటే ఏడిసినట్టుంది అనేస్తుంది. అలాంటిది తనే మెచ్చుకునే సరికి నేనో మంచి సినిమా చేశానని అనిపించింది అని చెప్పుకొచ్చాడు సుమంత్. నాకు డబ్బుల కోసం సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో మా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఖాళీగా కూర్చున్నాం కదా అని గతంలో నేను కొన్ని స్టుపిడ్ సినిమాలు చేశాను. వాటి విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా. మంచి సినిమాలు చేయడానికి కాలం కూడా కలిసిరావాలి. ఇప్పుడు మళ్లీరావా కూడా అంతే. అప్పుడప్పుడు చేయడానికి మంచి కథలే రావు. ఒకోసారి రెండు మూడు కథలు వస్తుంటాయి. అదంతే లక్ బై ఛాన్స్ అండ్ టైం అంటూ తన మనసులో మాట చెబుతున్నాడు.

కమర్షియల్ రేసుల గురించి నేను పట్టించుకోను. అలాగని నాకు నచ్చనివి కాదు. నేనూ కమర్షియల్ సినిమాలు చేశాను. అందులోనూ హిట్లున్నాయి. ఈ టైంలో అలాంటి వాటికన్నా మంచి పర్సనల్ సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపించింది. ప్రస్తుతం నిర్మాతగా సినిమాలు చేయాలని అనుకోవడం లేదు.

,  ,  ,  ,