Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2017 11:28:32
facebook Twitter Googleplus
Photo

గోదావరి.. మధుమాసం.. రెండు దశాబ్దాల సుమంత్ కెరీర్లో హిట్ అనిపించుకున్న సినిమాలు ఈ మూడు మాత్రమే. వీటికి ముందు.. తర్వాత.. మధ్యలో వచ్చిన సినిమాలేవీ ఆడలేదు. తెలుగులో చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోల్లో సుమంత్ ఒకడు. అందులోనూ చివరగా సుమంత్ చేసిన ఏమో గుర్రం ఎగరావచ్చు.. నరుడా డోనరుడా దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఈ దెబ్బతో సుమంత్ కెరీర్ ముగిసిపోయినట్లే అన్నారు కూడా. కానీ సుమంత్ మళ్లీ ఇంకో సినిమా చేశాడు. ఆ సినిమా ఇప్పుడతడికి మంచి ఫలితాన్నే అందించేలా కనిపిస్తోంది. ఈ వారాంతంలో విడుదలైన సుమంత్ సినిమా మళ్ళీ రావా ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షిస్తోంది.

విడుదలకు ముందు ప్రివ్యూలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మళ్ళీ రావా.. రిలీజ్ తర్వాత కూడా మంచి టాక్ తెచ్చుకుంది. సుమంత్ మార్కెట్ బాగా దెబ్బ తినడం వల్ల ఈ చిత్రాన్ని తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఐతే టాక్ పాజిటివ్ గా ఉండటం.. రివ్యూలు కూడా సానుకూలంగా రావడంతో సినిమా నెమ్మదిగా పుంజుకుంది. ముఖ్యంగా ఎ-క్లాస్ సెంటర్లలో.. మల్టీప్లెక్సుల్లో మళ్ళీ రావా వసూళ్లు బాగున్నాయి. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. తొలి రోజు 17 వేల డాలర్లే రాబట్టిన మళ్ళీ రావా.. రెండో రోజు 30 వేల డాలర్లు వసూలు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్లు బాగానే ఉన్నాయి.

,  ,  ,  ,  ,