Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 10:57:29
facebook Twitter Googleplus
Photo

నరుడా.. డోనరుడా.. టాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తుందని అంచనాలున్న మూవీ. టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త జోనర్ కావడంతో.. ఈ ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అసలు స్పెర్మ్ డొనేషన్ కాన్సెప్ట్ పై ఓ తెలుగు సినిమా రూపొందడమే ఆశ్చర్యమైతే.. అందులో అక్కినేని వంశానికి చెందిన హీరో నటించడం మరో విశేషం. కానీ ఈ చిత్రాన్ని సుమంత్ ధైర్యంగా తెరకెక్కించడం వెనక అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారని తెలుస్తోంది.

'తాత గారు విక్కీడోనర్ ను తన చివరి రోజుల్లో చూశారు. ఇలాంటి సినిమాలు తెలుగులో కూడా రావాలని అన్నారు. కొత్త సబ్జెక్టులను ఆదరించాలని.. నన్ను కూడా ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేయమని సూచించారాయన. ఆ తర్వాత నేను చాలానే సబ్జెక్టులు విన్నాను కానీ.. విక్కీ డోనర్ మాదిరిగా ఏదీ నచ్చలేదు. అందుకే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల సెన్సిబిలిటీస్ కి తగినట్లుగా కొన్ని మార్పు చేర్పులు చేసి రూపొందించాం' అని చెప్పాడు సుమంత్.

నరుడా డోనరుడా టైటిల్ అనౌన్స్ చేశాక.. మంచి హైప్ వచ్చిందని.. ఈ చిత్రాన్ని కేవలం 60 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశామన్న సుమంత్.. ఈ మూవీ ఎవరినీ నిరుత్సాహపరచదని అంటున్నాడు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఓ మూవీ వెనక.. ఆ మహానటుడి మాట ఉందంటే.. నిజంగా చెప్పుకోవాల్సిన విషయమే.

,  ,  ,  ,