Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2015 15:43:00
facebook Twitter Googleplus
Photo

ఇటీవలి కాలంలో హీరోలు దర్శకులు సొంత బ్యానర్లు పెట్టి యంగ్ ట్యాలెంటుకు ఛాన్సిస్తున్నారు. బడా ప్రొడక్షన్ హౌస్ లు సైతం కొత్త బ్యానర్లు స్థాపించి అందులో కొత్త కుర్రాళ్లకు అవకాశాలిస్తూ మినీ బడ్జెట్ సినిమాల్ని తెరకెక్కిస్తున్నాయి. టాలీవుడ్ లో ఇదో కొత్త పరిణామం. ట్యాలెంటుకు అవకాశాల వెల్లువ పెరగడానికి ఇలాంటి వాతావరణం అవసరం కూడా. అయితే నేను సైతం అంటూ కదనరంగంలోకి దూసుకొస్తున్నాడు హీరో సుమంత్.

అక్కినేని ఫ్యామిలీ హీరోగా సుమంత్ కెరీర్ ప్రారంభించినా.. ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాడు. కారణం ఏదైనా కెరీర్ ని విశ్లేషించుకుని .. ఇప్పుడు కొత్త ప్రయత్నం మొదలుపెడుతున్నాడు. ఇకనుంచి సొంత ప్రొడక్షన్ ప్రారంభించి నిర్మాతగానూ కొనసాగుతున్నానని అధికారికంగా చెప్పాడు. ఇటీవలే ఫేస్ బుక్ లో ఎంటరైన సుమంత్ అక్కడ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. స్వతహాగా నేను ఇంట్రోవర్ట్ ని. ఆ ప్రభావం నుంచి బైటపడుతున్నా. ఇక నుంచి సొంతంగా బ్యానర్ ప్రారంభించి అందులో సినిమాలు తీయాలనుకుంటున్నా. ప్రొగ్రెస్సివ్ గా ఉంటూనే పక్కా కమర్షియల్ సినిమాలు నిర్మించాలన్నది నా ప్లాన్. అలాగే వీలున్నప్పుడల్లా నటించడానికి కూడా సిద్ధమేనని సుమంత్ చెప్పాడు.

ఈ ప్రకటనతో సుమంత్ ఇక నుంచి కొత్త శాఖలో అడుగుపెట్టినట్టే. నటుడిగా నిలదొక్కుకోలేకపోయినా.. మావయ్య నాగార్జున ఇన్ స్పిరేషన్ తో నిర్మాతగా అయినా నిలదొక్కుకుంటాడేమో చూడాలి. అక్కినేని నాగార్జున హీరోగా ఎంత పెద్ద సక్సెస్ అయ్యాడో నిర్మాతగానూ అంతే పెద్ద సక్సెస్ అయ్యారు. ఏ విభాగం చేపట్టినా అందులో విజేతగా నిలిచాడు. సుమంత్ నిర్మాతగా భవిష్యత్ ని మలుచుకోవాలని ఆశిద్దాం.

,