హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్, రెజీనా ఇప్పుడు మరోసారి జతకడుతున్నారు. గతంలో వీరిద్దరూ కలసి 'రొటీన్ లవ్ స్టోరీ', 'రారా క్రిష్ణయ్య' చిత్రాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలసి ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. దీని ద్వారా లోకేష్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం గురించి సందీప్ చెబుతూ, "ప్రస్తుతం షూటింగ్ చెన్నయ్ లో జరుగుతోంది. కేవలం రాత్రి వేళల్లోనే ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాం. దీంతో పగలల్లా పడుకోవడం ... రాత్రి షూటింగ్ చేయడం" అన్నాడు. దీనిని తెలుగులోకి కూడా డబ్ చేస్తారు.
sandeepkishan, regina, tollywood, news,