Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2017 16:32:25
facebook Twitter Googleplus
Photo

తెలుగు నటుడు సాయికుమార్ పుత్రుడుగా సినీ రంగప్రవేశం చేసిన ఆది.. కొన్ని సాదా కథలు ఎంచుకొని వరుస అపజయాలు పాలైయ్యాడు. ఫ్లాప్ సినిమాలు నాలో కొత్త శక్తిని ఇచ్చాయి అని చెబుతూ తన కొత్త సినిమా శమంతకమణి గురించి తెగ పొగిడేస్తున్నాడు. ఈ సందర్భంగా తన పేరు చివర్లో వచ్చిన ఒక పెనుమార్పు గురించి చెప్పేశాడీ చిన్నోడు.

ఇప్పుడు ఉన్న తెలుగు ప్రేక్షకులుకు సాదా కథలు చెబితే అంత ఆసక్తి చూపించటంలేదు. అందుకే ఇప్పుడు అందరూ కొత్త కథల కోసం చూస్తున్నారు. నాకు కథ నచ్చితే ఆ సినిమాలో నటించడానికి నేను ఎప్పుడు సిద్దంగా ఉంటా. నేనే కాదు ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు అందరూ అలానే ఉన్నారు అందుకే శమంతకమణి చేశాను. నాతో ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోలు మరో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ గారు కూడా ఉన్నారు అందరికి ఈ సినిమాలో వాళ్ళ నటన పటిమను చూపించే అవకాశం ఉంది అంటూ చెప్పాడు ఆది.

అయితే మొన్నటి వరకు ఆది ఆది పూడిపెద్ది అంటూ తన పేరేసుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఆది సాయికుమార్ అంటూ పేరేయించుకుంటున్నాడు. ఇంతకీ సడన్ గా పేరు ప్రక్కనే డాడీ నేమ్ ఎందుకు కలిపినట్లబ్బా? పెద్ద కారణాలు ఏమి లేవు డైరెక్టర్ ఒకరోజు వచ్చి నీ పేరు మరీ చిన్నది అయిపోయింది అంటే.. అయితే ఆది పక్కన సాయికుమార్ అని చేర్చండి అన్నాను. అలా పెట్టి చూస్తే నాకు కూడా బాగ నచ్చింది అప్పుడే ఫిక్స్ చేసుకున్నా ఇక నుండి నా పేరు పక్కన నాన్న ఉండాలి అని అంటున్నాడు ఆది.

,  ,  ,  ,