Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2016 14:19:14
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాటమరాయుడు సంగతి చూసుకుంటున్నాడు. అటు రాజకీయాలను.. ఇటు సినిమాను ఏకకాలంలోనే హ్యాండిల్ చేస్తున్న పవన్.. షూటింగ్ విషయంలో పేస్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాడు. మరోవైపు.. రెండు కొత్త సినిమాలు కూడా సైన్ చేసేసి క్యూలో పెట్టేశాడు.

కాటమరాయుడులో గబ్బర్ సింగ్ బ్యూటీ శృతి హాసన్ తో జత కట్టిన పవర్ స్టార్.. తర్వాతి మూవీ హీరోయిన్ ఎంపికను కూడా ఫైనల్ స్టేజ్ కు తెచ్చాడట. అటు త్రివిక్రమ్ తోను.. ఇటు ఆర్ టి నీసన్ తో వేదాళం రీమేక్ ను తెరకెక్కించనున్న పవన్.. ఈ సినిమాలను హీరోయిన్స్ ను ఫైనల్ చేస్తున్నాడు. ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందే వేదాళం మూవీకి.. రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. దర్శక నిర్మాతలతో పాటు.. పవన్ కూడా ఈమెకు మొగ్గినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రకుల్ ఇండియాలో లేదు. రామ్ చరణ్ తో కలిసి ధృవ సాంగ్ షూటింగ్ కోసం థాయ్ ల్యాండ్ లో ఉన్న ఈ బ్యూటీ.. ఇండియా తిరిగి రాగానే.. పవన్ తో మూవీ విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు. అబ్బాయ్ రామ్ చరణ్ తో వరుసగా రెండు సినిమాలు చేసిన బ్యూటీని.. బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తుండడమే అసలు విశేషం. వేదాళం రీమేక్ ను వచ్చే ఏడాది మే నెలలో ప్రారంభించి.. దీపావళి నాటికి రిలీజ్ చేయాలన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.

,  ,  ,  ,  ,  ,