Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Aug-2015 16:58:27
facebook Twitter Googleplus
Photo

హీరోగా మారాక సునీల్ బాగా మారిపోయాడు. కమెడియన్ గా ఉన్నపుడయితే.. సునీల్ బాడీని బాడీ లాంగ్వేజ్ ని చూసినా చాలు.. ప్రేక్షకులకు నవ్వొచ్చేసేది. కాస్త బొద్దుగా ఉన్నా సరే... మాంచి ఈజ్ తో విపరీతమైన స్పీడ్ తో యాక్ట్ చేయడం జనాలను బాగా ఆకట్టుకుంది. అలాంటిది మనోడు హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్నాక రూట్ మార్చేశాడు.

కమెడియన్ హీరో అవడమంటే... సాధారణంగా కామెడీ పాత్రలను ఫుల్ లెంగ్త్ గా పోషిస్తారు అంతేగదా... అని ప్రేక్షకులకి గట్టి ఫీలింగ్. దీన్ని తుడిచేశాడు మన అందాలరాముడు. కమర్షియల్ మూవీలనే యాక్సెప్ట్ చేస్తూ... డ్యాన్స్ యాక్షన్ లలో కుమ్మేయడం మొదలుపెట్టాడు. చివరకు అంత బొద్దుగా ఉండే సునీల్.. ఫిట్ నెస్ పెంచేసి సిక్స్ ప్యాక్ చేసి ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేసేశాడు.

ఫిట్నెస్ తోపాటు ప్యాక్ లయితే వచ్చాయి కానీ... మనోడిలో క్యూట్ నెస్ కరిగిపోయింది. ఏళ్లపాటు ఓ రకంగా చూడ్డం అలవాటయిన జనాలకు... ఇతనే సునీల్ అంటే నమ్మబుద్ధేయలేదు. మిస్టర్ పెళ్లికొడుకు లాంటి మూవీలను పెద్దగా పట్టించుకోలేదు కూడా. దీంతో తన మిస్టేక్ బాగానే అర్ధమైంది సునీల్ కి. కాస్త ఒళ్లు చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఫేస్ లో మునుపటి క్యూట్ నెస్ తిరిగొస్తోంది. తను అనుకున్నవేవో చేసి చూపడం కాదు... జనాలు చూడాలని కోరుకునేవే ప్రధానం అని కాస్త లేట్ గా తెలిసినట్లుంది హీరోగా మారిన మన కామెడీ స్టార్ కి.

,  ,  ,  ,