Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Oct-2016 13:25:49
facebook Twitter Googleplus
Photo

ఒక సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రకటన చేయడం.. ఆ తర్వాత ఆ సంగతి మరిచిపోవడం మామూలే. రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్ అయిన కార్తికేయ కు సీక్వెల్ వస్తుందని అప్పట్లో చర్చ నడిచింది. ఐతే ఆ తర్వాత ఆ సంగతి అంతా మరిచిపోయారు. దర్శకుడు చందూ మొండేటి ?ప్రేమమ్? పనిలో బిజీ అయిపోతే.. హీరో నిఖిల్ వేరే ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు. దీంతో ఈ సీక్వెల్ సంగతి అటకెక్కేసినట్లే అనుకున్నారంతా. కానీ కచ్చితంగా ?కార్తికేయ-2? వస్తుందని అంటున్నాడు నిఖిల్. నిన్న జెమిని టీవీలో ?కార్తికేయ? టెలికాస్ట్ అయింది. ఆ సందర్భంగా చాలామంది అభిమానులు ఆ సినిమా అనుభూతుల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా నిఖిల్ స్పందిస్తూ.. కార్తికేయ తన కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ అని.. దీనికి సీక్వెల్ కచ్చితంగా వస్తుందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తాను.. దర్శకుడు చందూ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నామని.. ఈ కమిట్మెంట్లు పూర్తయ్యాక ?కార్తికేయ? సీక్వెల్ మీద దృష్టిపెడతామని నిఖిల్ వెల్లడించాడు. ?ప్రేమమ్? సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని విజయవంతంగా అధిగమించిన చందూ మొండేటి ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడు. తన తర్వాతి సినిమాను ఐడ్రీమ్ ప్రొడక్షన్స్ వాళ్లకు కమిటయ్యాడు చందూ. ఐతే అతడి కోసం దిల్ రాజు సహా ఇద్దరు ముగ్గురు ప్రముఖ నిర్మాతలు లైన్లో ఉన్నారు. నాగార్జున.. వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు సైతం అతడితో సినిమాలు చేయడానికి ఆసక్తితో ఉన్నారు. మరి వీటన్నింటి మధ్య చందూ ?కార్తికేయ-2? ఎప్పుడు చేస్తాడో చూడాలి.

,  ,  ,  ,  ,  ,