Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2017 13:10:00
facebook Twitter Googleplus
Photo

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కు గతేడాది పెద్దగా అచ్చి రాలేదు. మూడు సినిమాలు రిలీజ్ చేస్తే.. వాటిలో కృష్ణాష్టమి.. ఈడు గోల్డ్ ఎహె నిరుత్సాహపరిచాయి. జక్కన్న మూవీ విమర్శలకు గురైనా.. కలెక్షన్స్ బాగానే ఉండడం ఒక్కటే ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేస్తున్నాడు సునీల్.

ఉంగరాల రాంబాబు అనే టైటిల్ పై సునీల్ కొత్త సినిమా రూపొందుతోంది. ఈ టైటిల్ విషయంలో గతంలోనే క్లారిటీ ఉన్నా.. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ పోస్టర్ బాగా డిఫరెంట్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు క్రాంతిమాధవ్. జాతకాల పిచ్చోడిగా ఈ మూవీలో సునీల్ నటిస్తుండగా.. ఒక రోజా పువ్వుకు కళ్లజోడు పెట్టి.. తొడిమ మొత్తానికి రకరకాల రత్నాలు పొదిగిన ఉంగరాలను తగిలించారు. జాతకాలు నమ్మడం అనే కాన్సెప్ట్ తో చాలానే నవ్వులు పండించే అవకాశం ఉంటుందని ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు ప్రూవ్ చేసేశాయి.

గతంలో ఓనమాలు లాంటి డిఫరెంట్ మూవీ తీసిన క్రాంతి మాధవ్ డైరెక్షన్ కావడంతో.. ఉంగరాల రాంబాబుపై అంచనాలు బాగానే ఉన్నాయి. కొంత కాలంగా ఫ్యాన్స్ ని పూర్తి స్థాయిలో అలరించలేకపోతున్న సునీల్.. ఉంగరాల రాంబాబుగా ఆకట్టుకుంటానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

,  ,  ,  ,  ,  ,