Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2015 15:02:24
facebook Twitter Googleplus
Photo

సునీల్ ని కమెడియన్ గా ఓ మెట్టు పైకి ఎక్కించిన దర్శకుడు త్రివిక్రమ్. తాను రాసే ప్రతీ కథలోనూ సునీల్ కి మంచి క్యారెక్టర్ సృష్టించి బోలెడన్ని పంచ్ లు వేయించి మంచి గుర్తింపు వచ్చేలా చేశాడు. అయితే హీరో అయ్యాక మాత్రం సునీల్పై అస్సలు కాన్సంట్రేట్ చేయలేదు త్రివిక్రమ్. వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. తాను హీరో అయినా కామెడీ వేషాలేస్తానని తనకోసం పాత్రలు సృష్టించాలని తన మిత్రుడైన త్రివిక్రమ్ ని చాలా సార్లు అడిగాడు సునీల్. కానీ త్రివిక్రమ్ మాత్రం చెవిన వేసుకోలేదు. హీరోగా ఓ మెట్టు పైకి ఎక్కాక మళ్లీ కామెడీ వేషాలేయించి కిందకి దించబోనని త్రివిక్రమ్ చెబుతూ వచ్చాడు. దీంతో `ఖలేజా ` తర్వాత మళ్లీ సునీల్ కామెడీ వేషాలు వేసింది లేదు. అయితే సునీల్ ని మళ్లీ కమెడియన్ గా చూడాలని ప్రేక్షకులు మాత్రం కోరుకొంటున్నారు. అది తెలుసుకొని దర్శకులు కూడా సునీల్ ని దృష్టిలో ఉంచుకొని అప్పుడప్పుడు కామెడీ పాత్రలు సృష్టిస్తున్నారు. కానీ ఆయన హీరోగా బిజీ అవ్వడంతో ఆ పాత్రల కోసం వేరొకర్ని ఎంపిక చేసుకొంటున్నారు.

కొద్దిమంది దర్శకులు సునీల్ని అడిగినా ఆయన `నో ` చెబుతున్నారట. ఒకవేళ మళ్లీ కమెడియన్గా రీ ఎంట్రీ ఇవ్వాలనుకొంటే మాత్రం అది త్రివిక్రమ్ సినిమాద్వారానే ఇవ్వాలని సునీల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల `బ్రహ్మోత్సవం`లో సునీల్ కోసం ఓ కామెడీ పాత్రను సృష్టించారట. అందులో నటించాలని సునీల్ ని అడిగారు. కానీ ఆయన మాత్రం సున్నితంగా తోసి పుచ్చారని సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం `బ్రహ్మోత్సవం`. మహేష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. మంచి హీరోనే మంచి దర్శకుడే. కానీ సునీల్ మాత్రం నో చెప్పేశాడు. పారితోషికం భారీగా ఇస్తామన్నా ఆయన ఒప్పుకోలేదట. త్రివిక్రమ్ చేతులమీదుగా మళ్లీ కమెడియన్ గా ఎంట్రీ ఇవ్వాలనే ఆయన ఎంత మంచి ఆఫర్లు వచ్చినా వద్దనుకొంటున్నట్టు తెలుస్తోంది.

,  ,  ,  ,