సూర్య హీరోగా నటించిన ప్రయోగాత్మక సినిమా ?24? మే 6న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ?మనం? తర్వాత చాలా గ్యాప్ తీస్కొని విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్లతో ఇప్పటికే అంచనాలను పెంచేసింది. ఇక అందుకు ఏమాత్రం తగ్గకుండా టీమ్ కూడా ఇప్పట్నుంచే ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమా తమిళ వర్షన్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను రేపు పూర్తి చేసుకోనుంది.
ఇక తమిళంలో రేపు సెన్సార్ అవుతుండగా, తెలుగులో ఈ వారం చివర్లో సెన్సార్ జరగనున్నట్లు సమాచారం అందుతోంది. సూర్య తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించిన ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఓ సరికొత్త కథా నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ నడుస్తుందని తెలుస్తోంది. సూర్య సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. రెహమాన్ అందించిన సంగీతం కూడా ఇప్పటికే పాపులర్ అయిపోయింది. సూర్య ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.