Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 10:36:08
facebook Twitter Googleplus
Photo

ఎస్3 అంటూ.. కోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం సిరీస్ లో మూడో భాగం థియేటర్లలోకి వచ్చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు.. తమిళనాడులో పొలిటికల్ సిట్యుయేషన్ బాగోలేని టైంలో రిలీజ్ అయింది. సినిమాపై టాక్ బాగానే ఉన్నా.. మాస్ జనాలను బాగా ఆకట్టుకుంటున్నా.. కలెక్షన్స్ మాత్రం నిరుత్సాహకరంగా ఉన్నాయి. తమిళ్ కంటే తెలుగు వెర్షన్ కే కాసింత ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు ఇండస్ట్రీ జనాలు.

ఇప్పుడు ఎస్3 సక్సెస్ మీట్ నిర్వహించాడు హీరో సూర్య. చాలాసార్లు వాయిదా పడ్డా సినిమాను ఆదరించిన జనాలకు థ్యాంక్స్ చెప్పాడు. అంతే కాదు.. దర్శకుడు హరితో సింగం సిరీస్ ని కంటిన్యూ చేస్తానని కూడా చెప్పాడు సూర్య. సింగం4 పై కూడా వర్క్ చేస్తామన్నాడు. కానీ ఇది ఇప్పుడప్పుడే సాధ్యం కాకపోవచ్చని.. అన్నీ రెడీ సింగం4 ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఐదారేళ్లు పట్టచ్చని చెప్పాడీ కోలీవుడ్ స్టార్.

ఈ సిరీస్ లో తొలి భాగం 2010లోను.. రెండో బాగం 2013 లోను రిలీజ్ కాగా.. మూడో భాగం 2016లోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. ఎట్టకేలకు 2017లో వచ్చంది. మూడు భాగాలు ఆరేళ్ల సమయంలో రిలీజ్ అయితే.. నాలుగో భాగం ప్రారంభానికే ఐదారేళ్లు అన్నాడంటేనే.. సింగం4పై సూర్య ఇంట్రెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుందని అంటున్నారు సినీ జనాలు.

,  ,  ,  ,  ,