Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2017 10:57:45
facebook Twitter Googleplus
Photo

నాగార్జున బావగారు అనుమోలు సత్య భూషణ్ రావు గురువారం హైదరాబాద్ లో తుదిశ్వాశ విడిచిన సంగతి తెలిసిందే. ఈయన నటుడు సుశాంత్ తండ్రి. ఇకపోతే అక్కినేని కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక్కచోట చేరి సత్య భూషణ్ రావు గారికి అంతిమ గౌరవం తెలుపుకున్నారు. ఈ సంధర్భంగా సుశాంత్ పోస్టు చేసిన ఒక సోషల్ మీడియా మెసేజ్ మరియు కొన్ని ఫోటోలు.. అందరినీ కదిలించాయి.

“మా నాన్న చాలా నిరాడంబర మనిషి. ఫ్యామిలినీ ఫ్రెండ్స్ ని అమితంగా ప్రేమించే వ్యక్తి . ఎప్పుడు చాలా ప్రశాంతగా నవ్వుతూ కనిపించేవారు. ఆయనలా ఫ్యామిలిని ప్రేమించడం ఎవ్వరి వల్లా కాదు. అటువంటి మా నాన్న మా అందరినీ విడిచి వెళ్లారు. ఆయన వెళ్ళిపోయి మాకు మిగిల్చిన భాద చెప్పలేనిది కానీ మాలో ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మాకు స్ఫూర్తినిస్తాయి'' అంటూ సుశాంత్ తన భాదను పంచుకుంటూ ఇలాంటి సమయం లో మా కుటంబం సహకారం ఎన్నటికీ మరవలేనిది అని చెప్పాడు.

అయితే సుశాంత్ డాడ్ ను.. మామ్ ను అలాగే చిన్నప్పటి సుశాంత్ ను ఆ ఫోటోలలో చూస్తుంటే.. చాలా గొప్ప మెమరీస్ ఆయన తండ్రి పదిలంగా ఈ లోకంలో వదిలి వెళ్లారనే చెప్పాలి.

,  ,  ,  ,