Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2017 16:30:03
facebook Twitter Googleplus
Photo

150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మళ్లీ తన గత వైభవాన్ని చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు. మెగాస్టార్ కెరీర్ లోనే ఆత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కోసం దర్శకుడు అన్ని ఏర్పాట్లను పూర్తి చెసుకున్నాడు. అలాగే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి కనుక సురేందర్ రెడ్డి లాండన్ కి వెళ్ళాడు.

ఒక ప్రముఖ VFX స్టూడియోస్ తో ఒప్పందం కుదుర్చుకొని త్వరలోనే షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. చిత్ర నిర్మాత చరణ్ కూడా ఎప్పటికప్పుడు సురేందర్ కి టచ్ లో ఉంటూ అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. రీసెంట్ గా చిరు రంగస్థలం సెట్స్ కి వచ్చి చిత్ర యూనిట్ ని కలిసిన విషయం తెల్సిందే.. అయితే లుక్ కోసం చిరు చాలా శ్రమిస్తున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే ఒక లుక్ ని అనుకున్నారట. లండన్ నుంచి దర్శకుడు రాగానే ఆ లుక్ ని ఫైనల్ చేసి..అక్టోబర్ 20నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.

ఉయ్యాలవడ నరసింహ రెడ్డి పాత్ర "సైరా" లో ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. బ్రిటిష్ కాలంనాటి కథ కావడంతో దర్శకుడి ప్రతి చిన్న విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడాట. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నేతృత్వంలో హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియో లో భారీ సెట్ ను వేశారు. అలనాటి బ్రిటిష్ సామ్రాజ్యం మరియు రాజుల కోటలతో ఆ సెట్ ఉండనుంది. ఇక సినిమాలోని పాత్రలు - సాంకేతిక నిపుణులు అందరు ఒకే అయ్యారు.

,  ,  ,  ,  ,