Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-May-2017 10:42:30
facebook Twitter Googleplus
Photo

కబీర్ ఖాన్ బాలీవుడ్ కి పూర్తిగా అవతలి తీరం నుండి వచ్చిన డైరెక్టర్. ఐతేనేమి ఇప్పుడు బాలీవుడ్ లో రియాలిటీ కమర్షియల్ ఫిల్మ్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. తన బజారంగి భాయిజాన్ సినిమాకు రాజమౌళి నాన్న విజయేంద్ర ప్రసాద్ గారు కథను కూడా అందించారు. తన కొత్త ప్రాజెక్టు సల్మాన్ ఖాన్ హీరో గా నిర్మిస్తున్న మూవీ ట్యూబ్ లైట్ టీజర్ విడుదల కార్యక్రమంలో బాహుబలి గురించి ఇలా స్పందించారు.

బాహుబలి విజయం నాకు ఎంతో ఆనందాన్ని బలాన్ని ఇచ్చింది. బాహుబలి తెలుగు సినిమా కాదు మన ఇండియా సినిమా అంటూ.. రాజమౌళి అతని టీమ్ పనిచేసిన తీరుకు నేను ఫిధా అయిపోయా. ఒక రీజనల్ సినిమా భాష ఎల్లలును పూర్తిగా పోగొట్టింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఒక మంచి సినిమా విజయం పొందినా నేను చాలా ఆనందపడతాను అన్నాడు కబీర్.

కబీర్ ఖాన్ ట్యూబ్ లైట్ సల్మాన్ ఖాన్ సొంత ప్రొడక్షన్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తన సోదరుడు సొహైల్ ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా హాలీవుడ్ మూవీ లిటిల్ బోయ్ ఆదారంగా తీస్తున్నారు. జూన్ 23న విడుదల అవుతుంది. రాజమౌళి సక్సెస్ ఇప్పుడు చాలామంది డైరెక్టర్ లకు చెమటలు పట్టిస్తోంది.

,  ,  ,  ,  ,