Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2017 11:46:18
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ- పూరీ జగన్నాధ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో శరవేగంగా సినిమా రూపొందుతోంది. చకచకా సినిమాలు చేయడంలో పూరీ భలే స్పీడ్ చూపిస్తుంటాడు. బాలయ్య కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ.. ఫుల్ పేస్ లో షూటింగ్ చేసేయడం పెద్ద వింతేమీ కాదు.

NBK101గా పరిగణిస్తున్న ఈ మూవీకి ఇప్పుడు టైటిల్ ని ఫైనల్ చేసేస్తున్నారు. ఇప్పటికే మూడు పేర్లను షార్ట్ లిస్ట్ చేయడమే కాదు.. వాటిని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించేశారు కూడా. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం కోసం.. జై బాలయ్య.. ఉస్తాద్.. తేడా సింగ్ అంటూ మూడు టైటిల్స్ రిజిస్టర్ చేయించడం విశేషం. జై బాలయ్య టైటిల్ ను నందమూరి అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేయడమే కాదు.. యాక్సెప్ట్ చేస్తారని కూడా చెప్పచ్చు. ఇక ఉస్తాద్ టైటిల్ కూడా బాగా పవర్ ఫుల్ గా ఉంది. బాలయ్య మూవీస్ కి సహజంగా ఇలాంటి టైటిల్సే కనిపిస్తుంటాయి.

కానీ తేడా సింగ్ అన్న దగ్గరే పూరీ మార్క్ బయటపడుతోంది. తన సినిమాలకు నెగిటివ్ టైటిల్స్ పెట్టే పూరీ.. హీరోయిజాన్ని కూడా డిఫరెంట్ గానే ప్రెజెంట్ చేస్తాడు. ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నా.. విభిన్నమైన మేనరిజమ్స్ చూపిస్తాడట. రొటీన్ గ్యాంగ్ స్టర్ కు భిన్నంగా ఈ రోల్ ఉంటుందట. అందుకే తేడా సింగ్ అన్న టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందన్నది పూరీ ఉద్దేశ్యం.

,  ,  ,  ,  ,