Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2017 11:07:36
facebook Twitter Googleplus
Photo

ఖైదీ నెంబర్ 150 అంచనాలను మించి హిట్టవ్వడం మెగా అభిమానులకు మాంచి ఆనందం కలిగించింది. తర్వాత 151వ సినిమా ఏం చేయాలనే దానిపై ఆలోచించి చివరకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు చిరు ఓటేశారు. అంతకుముందే నరసింహారెడ్డి జీవిత కథపై బోలెడంత పరిశోధన చేసి చాలా వివరాలు సేకరించాక... సబ్జెక్ట్ పై గురి కుదిరాకే సైరా నరసింహారెడ్డి టైటిల్ తో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇంతవరకు తెలుగులో ఎప్పుడూ లేనంత భారీ తారాగణంతో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కించబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నప్పటికీ ప్రస్తుతానికి ఇంకా ఆ పని స్టార్ట్ చేయలేదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నరసింహారెడ్డి పోరాడిన తీరు అందరికీ తెలిసిందే. దానిని వెండితెరపై ఎంత వీరోచితంగా చూపించగలరు అన్నదే కీలకం. దీనికి సంబంధించి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. అయినా నటీనటుల డేట్లు ఇబ్బంది రాకుండా అక్టోబరు మధ్య నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

సైరా సినిమాలో ఓ ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. చిరంజీవి పక్కన హీరోయిన్ గా నయనతార తొలిసారి కనిపించనుంది. వీరితోపాటు తమిళ హీరో విజయ్ సేతుపతి - కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ఫస్ట్ పోస్టరే అదిరిపోయేలా ఉండటంతో అభిమానులంతా షూటింగ్ విశేషాల కోసం ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు

,  ,  ,  ,  ,  ,