Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jan-2016 17:57:19
facebook Twitter Googleplus
Photo

తాప్సీ పన్ను గేర్ మార్చేసింది. ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఆమె కెరీర్ రేంజ్ మారిపోతోంది. ఏళ్లపాటు ఎదురుచూసిన సక్సెస్ ను గంగ చిత్రంతో అందుకున్న తాప్సీ.. ఆ తర్వాత బాగానే స్పీడ్ పెంచింది. జాతీయ స్థాయిలో మేగజైన్ కవర్ పేజ్ లు ఎక్కుతూ.. తన స్థాయిని క్రమక్రమంగా పెంచుకుంటోంది. యాక్ట్రెస్ గా కూడా బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడంతో.. అనేక ఇండస్ట్రీల నుంచి తాప్సీకి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

అయితే.. సక్సెస్ తర్వాత వస్తున్న ఆఫర్స్ కావడంతో సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది ఈ ఢిల్లీ భామ. కానీ రీసెంట్ గా వచ్చిన ఓ రెండు ఆఫర్స్ మాత్రం తాప్సీని కూడా షాక్ చేశాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేస్తున్న ఓ సినిమా కోసం తాప్సీ సైన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. జాతీయ అవార్డ్ గ్రహీత అనిరుధ్ రాయ్ చౌధురీ డైరెక్షన్ లో చేయబోతున్న ఓ కొత్త మూవీ కోసం తాప్సీని తీసుకున్నారు. గత కొంతకాలంగా ఈమెను తీసుకుంటారనే అంచనాలున్నా.. ఇప్పుడీమె ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేయడం విశేషం. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ మూవీలో.. ఢిల్లీ అమ్మాయిగా నటించనుంది తాప్సీ. నేటివిటీ ప్రకారం కూడా తాప్సీ ఢిల్లీ అమ్మాయే కావడం విశేషం.

అమితాబ్ తో పాటు రోల్ కావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చేసేసిందట. దీంతో పాటు అక్షయ్ కుమార్ తో రెండోసారి జత కట్టేందుకు కూడా తాప్సీ సిద్ధమవుతోంది. కోలీవుడ్ మూవీ కత్తి రీమేక్ లో అక్షయ్ సరసన నటించేందుకు కూడా తాప్సీ అంగీకరించింది.

,  ,  ,