Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Oct-2015 17:07:59
facebook Twitter Googleplus
Photo

మంచి యాక్టర్ గానే కాదు.. మంచి మనసున్న భామగా తాప్సీ పన్ను నిరూపించుకుంది. రీసెంట్ గా గంగ మూవీతో తన సత్తాను చాటిన తాప్సి.. భారీ మొత్తం ఇస్తామన్నా ఓ బ్రాండ్ కి ప్రచారం చేయబోనంటూ తేల్చి చెప్పేసింది. దీనికి కారణం ఇది ఓ లిక్కర్ బ్రాండ్ కావడమే.

సాధారణంగా హీరోయిన్లు తమ అభిప్రాయాలను బైట పెట్టేందుకు పెద్దగా ప్రయత్నించరు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఆన్ లైన్ లో మహా యాక్టివ్ గా ఉంటుంది. ఒపీనియన్స్ చెప్పడంలో ఏ మాత్రం మొహమాటపడదు. అవతలి వాళ్లు కాస్త గింజుకునే అవకాశం ఉన్నా సరే.. తన అభిప్రాయాన్ని చెప్పడం మానదు. అలాంటి తాప్సీకి ఆల్కహాల్ యాడ్ చేయాలంటూ ఆఫర్ వచ్చింది. ఈ విషయం నిజానికి ముందే మీడియాకి లీకైంది. తాప్సీ చెప్పే సమాధానం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు చాలామంది.

మద్యపానాన్ని ప్రమోట్ చేసే ప్రకటనలో నటించేందుకు తాప్సీ ఒప్పుకోలేదు. "నేను చేసే యాడ్స్ ద్వారా అభిమానులు నా వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకుంటారు. నేను నమ్మే ఉత్పత్తులకు మాత్రమే ప్రచారం చేస్తాను. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను" అంటోంది తాప్సీ. ఈ భామ గంగ హిట్ తర్వాత సౌత్ సినిమాకి దేనికీ సైన్ చేయలేదు. హిందీలో మాత్రం తాప్సీ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి.

,  ,  ,