Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 12:50:48
facebook Twitter Googleplus
Photo

మా అవార్డ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి లైవ్ డ్యాన్స్.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ ఫంక్షన్ మొత్తానికి చిరు వేసిన డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. గ్యాంగ్ లీడర్ సినిమాలో టైటిల్ సాంగ్ కి గాను చిరు వేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. 'చిక్ చిక్ చేలం' అంటూ మెగాస్టార్ డ్యాన్స్ వేస్తుంటే.. ఆడిటోరియంతో అరుపులతో నిండిపోయింది.

మరి చిరు డ్యాన్స్ అంటే.. సంథింగ్ స్పెషల్స్ - అట్రాక్షన్స్ ఉంటాయ్ కదా. అలాగే పాటలో భాగంగా మెగాస్టార్ 'పాపా రీటా' అనగానే స్టేజ్ పైన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యక్షమైపోయింది. చిరుతో కలిసి స్టేజ్ పై స్టెప్పులు వేసేసింది. ఈ కాంబినేషన్ అందరినీ ఆకట్టుకుంది. అసలు చిరు మూవీ అంటే మొదటగా చెప్పుకోవాల్సింది డ్యాన్సుల గురించే. ఈ కాలం హీరోయిన్స్ లో అయితే.. చిరుతో సమానంగా స్టెప్స్ వేయగల సత్తా తమన్నాకి తప్ప వేరే ఎవరికీ లేదనే మాటను అంగీకరించక తప్పదు.

రచ్చ రిలీజ్ టైంలో వానా వానా వెల్లువాయే సాంగ్ కి తమన్నా డ్యాన్స్ చూసినపుడే చిరు తెగ ముచ్చట పడిపోయారు. ఆ తర్వాత తనతో హీరోయిన్ గా చేసేందుకు ఛాన్స్ ఉన్న భామల్లో.. తమన్నా పేరును స్వయంగా చెప్పారు. ఇప్పుడు స్టేజ్ పై తన ట్యాలెంట్ ను కళ్లారా చూపించేసింది మిల్కీ.

మెగా 150లో హీరోయిన్ గా చేసేందుకు.. నయనతార తెగ చిక్కిపోయి కనిపిస్తోంది. అనుష్క అయితే లావయిపోయి ఇబ్బందిపడుతోంది. ఇప్పుడు దీపికా పదుకొనే అనే మాట కూడా వినిపిస్తోంది. వీళ్లందరితో పోల్చితే150లో నటించేందుకు తమన్నాను మించిన ఆప్షన్ మరొకటి ఉండదనే మాటను యాక్టెప్ట్ చేయాల్సిందే.

,  ,  ,  ,  ,  ,  ,  ,