Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2017 11:01:33
facebook Twitter Googleplus
Photo

మిల్కీ బ్యూటీ తమన్నా గత కొంత కాలంగా అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఐరెన్ లెగ్ అనే నేమ్ ని చాలా ఏళ్లుగా మోస్తోంది. అయితే ఎలాగైనా ఆ ముద్రను చెరిపేసుకోవాలని చాలా కష్టపడుతోంది. దీంతో తన ఫిట్నెస్ పై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం కొన్ని మంచి ఆఫర్స్ ని అందుకుంటూ ముందుకు సాగుతోంది. అంతే కాకుండా మధ్యలో కొన్ని ఐటెమ్స్ సాంగ్స్ చేస్తూ.. తన ఆదాయాన్ని కూడా పెంచుకుంటోంది.

ఇకపోతే తమన్నా ప్రస్తుతం తెలుగులో బాలీవుడ్ క్వీన్ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మడు ఏకంగా మరో బాలీవుడ్ ఛాన్స్ ని దక్కించుకొంది. ఆ సినిమా కోలీవుడ్ జిగర్తాండా సినిమాకు రీమేక్ గా రాబోతోంది. తమన్నా అదృష్టం ఏమిటో గాని సినిమాలో ప్రముఖ తారలు నటిస్తున్నారు. అమ్మడికి జోడిగా ఫర్హాద్ అక్తర్ నటిస్తున్నాడు. తమిళ్ లో ఆ పాత్రను సిద్దార్థ్ చేయగా లక్ష్మి మీనన్ చేసిన పాత్రను తమన్నా చేస్తోంది.

ఇక భూమి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ యాక్టర్ సంజయ్ దత్త్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా గా తెరకెక్కే ఈ సినిమాకు నిషికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నిర్మిస్తున్నాడు. సినిమాపై అంచనాలు భారీగా ఉండడంతో తమన్నా ఈ సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకోవాలని చూస్తోంది.

,  ,  ,  ,  ,