Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2017 12:45:32
facebook Twitter Googleplus
Photo

రాజశేఖర్.. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజల మధ్య గొడవ గురించి తెలిసిందే. రాజశేఖర్ తో తీసిన ‘వేటగాడు’ సినిమాతో తన కెరీరే సర్వనాశనమైందని.. ఆ సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్ ఏమాత్రం సహకరించలేదని.. చాలామంది వద్దన్నా కూడా రాజశేఖర్ తో సినిమా చేసి తాను ఇబ్బంది పడ్డానని గతంలో తమ్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఇటీవలే రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టాలని తమ్మారెడ్డి భావించారని.. ఆ విషయంలో పట్టుదలతో వ్యవహరించి డబ్బులు రాబట్టుకున్నానన్న కోపంతోనే ఆయన తనపై అలాంటి ఆరోపణలు చేశారని.. కేవలం తాను షూటింగుకి లేటుగా రావడం వల్ల సినిమా ఫ్లాప్ అవుతుందా అని ప్రశ్నించారాయన.

కాగా ఇప్పుడు మళ్లీ తమ్మారెడ్డి వంతు వచ్చింది. ఆయన తాజాగా మరో ఇంటర్వ్యూలో రాజశేఖర్ గురించి మాట్లాడారు. ఈసారి ఆయన స్వరం మారింది. రాజశేఖర్ విషయంలో మునుపటిలా ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ‘వేటగాడు’ షూటింగ్ టైంలో రాజశేఖర్ ఇబ్బంది పెట్టడంతో షూటింగ్ డిలే అయిన మాట వాస్తవమే అని.. అలాగని అతను చెడ్డవాడని అనలేనని ఆయనన్నారు. రాజశేఖర్ లో మంచి లక్షణాలు చాలా ఉన్నాయని.. అతను వ్యక్తిగతంగా చాలా మంచి వాడని.. గొప్ప నటుడని.. అలాంటి నటుడు తెలుగులో మరొకరు లేరని అన్నారు తమ్మారెడ్డి. ఇటీవల ‘గరుడవేగ’ సినిమా చూసి రాజశేఖర్ కు ఫోన్ చేసి అభినందించినట్లు తమ్మారెడ్డి వెల్లడించారు. రాజశేఖర్ వైద్యుడిగా కూడా చాలా మందికి సాయం చేస్తాడని.. ఇండస్ట్రీలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే.. వెళ్లి చూసి వస్తాడని.. డాక్టర్లకు కూడా మనవాడు బాగా చూసుకోమని చెబుతాడని.. ఈ మంచి లక్షణాల్ని తాను విస్మరించలేనని తమ్మారెడ్డి తెలిపారు. ‘వేటగాడు’ సినిమా విషయంలో మాత్రం తాను చాలా దెబ్బ తిన్నానని.. ఈ సినిమాకు పారితోషకం విషయంలో రాజశేఖర్ ను తాను ఇబ్బంది పెట్టిన మాట కూడా వాస్తవమని.. ఐతే అతను రిలీజ్ ఆపించి.. పట్టుబట్టి డబ్బులు వసూలు చేయించుకున్నాడని.. అప్పుడు కూడా పూర్తి పేమెంట్ ఇవ్వలేదని.. రాజశేఖర్ వల్ల ఒక రోజు ఆలస్యంగా సినిమా రిలీజై.. ఆ రకంగా కూడా తాను చాలా నష్టపోయానని ఆయనన్నారు.

,  ,  ,  ,