Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2017 11:06:24
facebook Twitter Googleplus
Photo

కొంత మంది కుర్రహీరోలు మొదట్లో రాగానే వరుస హిట్స్ అందుకొని ఆ తర్వాత మళ్లీ ఎందుకోగానీ డిజాస్టర్స్ తో డౌన్ అవుతున్నారు. ఎప్పుడో చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారు ఇప్పుడు హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో తనీష్ కూడా ఒకరు. మనోడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంత ఫేమస్ అయ్యాడో అందరికి తెలిసిందే. కానీ టీనేజ్ వయసులోకి వచ్చాక హీరోగా ట్రై చేసి బాగానే మెప్పించాడు. కానీ ఆ సంబరం ఎన్నో రోజులు ఉండలేదు. లవర్ బాయ్ గా లక్షణాలు ఉన్నా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు.

అంతే కాకుండా అన్ని తరహా పాత్రలను చేయాలనే కోరికతో ఎక్కువగా మాస్ లుక్ లో కూడా ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు. నచ్చావులే సినిమాతో మొదట స్మార్ట్ ఎంట్రీ ఇచ్చి ట్రాక్ అయితే సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ రైడ్ తో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత తీసిన చాలా సినిమాలు మనోడికి గుర్తింపు తేలేకపొయాయి. అపజయాలు వచ్చినా మాస్ వైపే ఎక్కువగా ట్రై చేశాడు. ఆ మధ్యలో నేను లోకల్ డైరెక్టర్ త్రినాద రావ్ తెరకెక్కించిన మేం వయసుకు వచ్చాం అనే సినిమాతో లవర్ బాయ్ గా కనిపించి మంచి హిట్ అందుకున్నాడు. ఓ విధంగా తనీష్ కెరీర్ లో అదే బెస్ట్ సినిమా కూడా.

ఇక ఆ సినిమా హిట్ తో మళ్లీ మాస్ వైపు అడుగులు వేశాడు. చాణక్యుడు అనే ఒక మాస్ యాక్షన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలని చూశాడు. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది ఎవ్వరు పట్టించుకోలేదు. ఆఖరికి నక్షత్రం సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించినా లాభం లేకపోయింది. అయినా కూడా తనీష్ తన మాస్ ప్రయాణాన్ని ఏ మాత్రం తగ్గించడం లేదు. మళ్లీ మారో మాస్ కథతో రెడీ అయ్యాడు. మహీంద్ర దర్శకత్వంలో తెరెక్కుతోన్న ప్రేమిక అనే సినిమాలో మళ్లీ మాస్ క్యారెక్టర్ తోనే కనిపిస్తున్నాడు. రీసెంట్ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.

,  ,  ,  ,  ,