బిగ్ బాస్ షోకి మెల్లిగా ఫాలో వర్స్ పెరిగారు. దీంతో ఈ షో పై టాలీవుడ్ కన్నుపడింది. యన్టీఆర్ హోస్ట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ ని ఇలాగైనా మెప్పించవచ్చనే ఉద్దేశంతో సినిమా ప్రచారాల్ని బిగ్ బాస్ షోలో చేయడానికి చిత్ర వర్గాలు ఉత్సాహం చూపుతున్నాయి.
ఇందులో భాగంగా ఇటీవలే నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్ లో భాగంగా రానా బిగ్ బాస్ హౌస్ ను సందర్శించాడు. అయితే ఇది పెద్దగా జనాల్ని ఆకట్టుకోలేదు. ఆ రోజు ఈ షో రేటింగ్ లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో ఖంగుతిన్న ఛానల్ వారు ఇప్పుడు బిగ్ బాస్ షోకి రావాలనుకోనే సెలబ్రెటీల్ని కూడా ఏదొక కాన్సెప్ట్ తో రమ్మంటున్నారని తెలిసింది. దీంతో షోకి తగ్గట్లుగా వినూత్నమైన కాన్సెప్ట్ లు రెడీ చేసుకొని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడుతున్నారట సెలబెట్రీలు.
తాజాగా ఢిల్లీ బ్యూటీ తాప్సీ బిగ్ బాస్ షో లో పార్టిస్ పేట్ చేసిందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఆగస్ట్ 18న ఆనందో బ్రహ్మ విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా కథకి తగ్గట్లుగా ఓ డిఫరెంట్ గెటెప్ తో తాప్సీ బిగ్ బాస్ హౌస్ ని సందర్శించినట్లుగా తెలిసింది. బాలీవుడ్ లో ఎక్కువుగా కనిపించే ఈ ప్రమోషన్ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవ్వడం బాగానే ఉందని సినీ పెద్దలు అంటున్నారు.