Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 12:45:54
facebook Twitter Googleplus
Photo

చిన్న సినిమాగా విడుదలై పెద్ద స్థాయికి వెళ్లింది ?పెళ్లిచూపులు? సినిమా. కలెక్షన్ల కంటే కూడా టాలీవుడ్ పై ఆ సినిమా చూపిన ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మన సినీ చరిత్రలోనే ఈ సినిమా ఓ కీలక మలుపుగా భావిస్తున్నారు. ఐతే విడుదల తర్వాత ఇంతగా చర్చనీయాంశమైన సినిమాను రిలీజ్ కు ముందు చాలామంది చాలా తేలిగ్గా తీసి పడేశారట. సినిమా పూర్తి చేశాక తాను ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డానో.. ఎంతమంది తనను వెనక్కి లాగడానికి ప్రయత్నించారో దర్శకుడు తరుణ్ భాస్కర్ చెబుతూ ఓ స్టేట్మెంట్ లాంటిది ఇచ్చాడు. పెళ్లిచూపులు అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో అతనేమన్నాడో.. ఇండస్ట్రీ జనాల్ని ఎలా ఉతికారేశాడో అతడి మాటల్లోనే..

??ఈ రోజు పెళ్లిచూపులు 49వ రోజు. ప్రపంచ వ్యాప్తంగా దూసుకెళ్తోంది. రివ్యూల్లో ఏవరేజ్ గా 3.5 రేటింగ్ వచ్చింది (4 స్టార్ల కోసం మేం డబ్బులివ్వాల్సిందేమో). టీం సభ్యుల్లో ప్రతి ఒక్కరి ఫోన్లూ రింగవుతూనే ఉన్నాయి. పత్రికల్లో.. బ్లాగుల్లో ఈ సినిమా గురించి ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. ఆటోగ్రాఫులిచ్చాం.. బోలెడంత కలెక్షన్ వచ్చింది. మా పేర్లు టీవీ ఛానెళ్లలో మార్మోగాయి. నేను సక్సెస్ చూశాను.

కానీ సినిమా విడుదలవడానికి కొన్ని వారాల ముందు నేను ఫెయిల్యూర్ చూశాను. ఇండస్ట్రీ జనాలు ఈ సినిమా మీద ఆశలు వదులుకునేలా చేశారు. ఈ సినిమా వేస్ట్ అన్నారు. కోటి రూపాయల లోపు బడ్జెట్లో తీసిన సినిమాలు మన ఇండస్ట్రీకి పనికి రావు. నేను కలిసి పని చేసిన వాళ్లే ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. ?చిన్న సినిమా? అనే మాట నా చెవుల్లో చాలాసార్లు మార్మోగింది. ఆ మాటను కించపరిచేలా వాడారు. ఇది రెండు గంటల షార్ట్ ఫిల్మ్ అని కూడా అన్నారు. ఐక్యూ తక్కువున్న వాళ్లకు అది లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమాలా కనిపించింది. సినిమా ఎలా తీయాలి.. మన ప్రేక్షకులకు ఏం నచ్చుతుంది.. కులం.. ప్రాంతం.. డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది.. ఇంకా పబ్లిసిటీ ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. నా ఆత్మవిశ్వాసాన్ని అథమ స్థాయికి తీసుకొచ్చేశారు. ఏదైనా సాయం చేస్తారన్న ఆశతో హార్డ్ డిస్క్ లో ఈ సినిమాను పెట్టుకుని చాలామందిని కలిశాను. వాళ్లందరూ జ్యోతిష్యుల తరహాలో మాట్లాడారు. ఈ చిత్రం కొన్ని లక్షలు మాత్రమే తెస్తుందని తీర్పిచ్చారు. అలాంటి వాళ్లందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నా. రేపు పెళ్లిచూపులు 50వ రోజు?? అని ముగించాడు తరుణ్ భాస్కర్.

,  ,  ,  ,