Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Nov-2017 10:25:55
facebook Twitter Googleplus
Photo

ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడు ముందుంటారు. ఆయన కెరీర్ లో ఎన్నో సేవ కార్యక్రమాల్లో పాల్గొని కొన్ని మంచి పనులను కూడా చేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా చిరంజీవి అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే మెగాస్టార్ మరొక మంచి కార్యక్రమాని సై అనే సమయం వచ్చింది.

మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో గాని తెలుగు మూవీ ఆర్టిస్ అసోసియేషన్ (maa) త్వరలో అమెరికాలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. అయితే ఈ వేడుకలో చాలా మంది ప్రముఖులు పాల్గొనబోతున్నారు. అలాగే చిత్ర పరిశ్రమలోని పెద్దలు కూడా హాజరు కానున్నారు. వేడుకకి మెగాస్టార్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. అయితే అక్కడ మా అసోసియేషన్ మెగాస్టార్ కి ఒక టాస్క్ ని ఇవ్వనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ల కోసం త్వరలో హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఒక ఓల్డేజ్ హోమ్ ను కట్టించాలని మా కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. అందుకోసం రెండు కోట్ల వరకు ఖర్చు అవుతోంది. అయితే ఆ నిధుల కోసం మెగాస్టార్ ను ముందు ఉంచి నిధులు సేకరించాలని డిసైడ్ అయ్యారట.

,  ,  ,  ,  ,