Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 11:26:45
facebook Twitter Googleplus
Photo

కొత్త కొత్త విలన్స్ వస్తూనే ఉన్నారు. గతంలో విలన్ పాత్రలు కాసింత వయసు మీరినవి కనిపించేవి కానీ.. ఈ మధ్య కాలంలో యంగ్ విలన్స్ ట్రెండ్ బాగా పెరిగింది. హీరోకి సమానంగా విలన్స్ కూడా సత్తా చాటేస్తున్నారు.

రోగ్.. సింగం3 వంటి చిత్రాలతో ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ విలన్ ఠాకూర్ అనూప్ సింగ్. ఈ కుర్ర విలన్ కి ఇప్పుడు బ్రహ్మాండమైన ఛాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న నా పేరు సూర్య చిత్రంలో ఠాకూర్ అనూప్ సింగ్ ను విలన్ గా తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు ఈ కుర్రాడు. నా పేరు సూర్య టీంతో కలిసి.. ఫోటోలను కూడా షేర్ చేసేస్తున్నాడు. బన్నీ మూవీ ద్వారా తన కెరీర్ మరింతగా ఊపందుకుంటుదని ఆశిస్తున్నాడు ఠాకూర్ అనూప్ సింగ్. గతంలో సరైనోడు మూవీతో ఆది పినిశెట్టి కెరీర్ ని పరుగులు పెట్టించిన అల్లు అర్జున్.. ఇప్పుడు రోగ్ బాబు ఠాకూర్ అనూప్ సింగ్ కి అదే జోష్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న నా పేరు సూర్య చిత్రానికి నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్. యాక్షన్ జోనర్ లో.. కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఫుల్ గా రంగరించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ మిలిటరీ గెటప్.. రీసెంట్ గానే బయటకు వచ్చింది.

,  ,  ,  ,  ,