Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2016 15:04:37
facebook Twitter Googleplus
Photo

తెలుగు - తమిళ - హిందీ బాషల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటూ.. అగ్ర కథానాయికగా చెలామణి అవుతోన్న నటి శ్రుతిహాసన్. జీవితంలో శ్రుతి మర్చిపోలేని రోజు త్వరలోనే రాబోతోందని ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని చెబుతోంది. ఆరోజు మరెంటో.. కాదు. శ్రుతికి తన తండ్రి కమల్ హాసన్ తో 'విలయాట్టు' అనే సినిమాలో నటించే అవకాశం లభించింది.

దీంతో అమ్మడు సంతోషానికి అవధుల్లేవట. నిజంగా తన తండ్రితో కలిసి ఎప్పటినుండో నటించాలనుందట. ఇదొక అరుదైన అవకాశమని చెప్పుకొచ్చింది. మరో విశేషమేంటంటే శ్రుతి ఈ సినిమాలో కమల్ కు కుతురుగానే కనిపిస్తోంది. గతంలో ఇలాంటి ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. మరోసారి ఇలాంటి ఛాన్స్ రావడం తన అద్రుష్టంగా భావిస్తోందట. నాన్నతో కలిసి నటించడం అంత సులువు కాదు కాని ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా అని శ్రుతి తెలియజేసింది.

,  ,  ,