Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2017 11:47:54
facebook Twitter Googleplus
Photo

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయిన తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు పాత్రలు పోషించనుండగా.. ఇంకా హీరోయిన్స్ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచేసినట్లు మూడు వారాల క్రితమే కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేశాడు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం ఈ నెల 15 నుంచి యూనిట్ తో జాయిన్ అవనున్నాడు.

జై లవ కుశ అనే వర్కింగ్ టైటిల్ పై రూపొందుతున్న ఈ సినిమాలో.. ఇప్పటివరకూ రాశిఖన్నాను మాత్రమే హీరోయిన్ గా ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రకు నివేదా థామస్ ను దాదాపుగా ఖాయం చేశారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్న మూడో పాత్రకు హీరోయిన్ ని ప్రకటిస్తారని భావించారు కానీ.. అసలు మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నది లేటెస్ట్ న్యూస్. ఈ పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ తో కేమియో చేయించబోతున్నారట. అంతే తప్ప ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ మాత్రం సినిమాలో ఉండదని అంటున్నారు.

ఈ సినిమాలోని మూడు పాత్రలకు సంబంధించి.. మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడట యంగ్ టైగర్

,  ,  ,  ,  ,  ,