Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 10:32:41
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమా హీరో అంటే కొన్ని నిర్దిష్టమైన లక్షణాలుంటాయి. హీరో అత్యంత శక్తిమంతుడై ఉంటాడు. అతడికి ఎదురంటూ ఉండదు. హీరోయిన్ అతడంటే పడి చచ్చిపోతుంది. విలన్ అతనంటే వణికిపోతాడు. హీరోకు ఏ చిన్న లోపమూ ఉండదు. దశాబ్దాలుగా మన హీరోల్ని ఇలాగే చూస్తూ వస్తున్నాం. ఐతే ఈ మధ్య ట్రెండు మారుతోంది. కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమాలో హీరోల పాత్రలు మారుతున్నాయి. వికలాంగులుగా.. అంధులుగా.. వైకల్యం ఉన్న పాత్రలు చేయడానికి మన కథానాయకులు సాహసిస్తున్నారు. ఇప్పటికే మొదలైన మార్పు నెమ్మదిగా ఊపందుకుంటూ.. మున్ముందు మరిన్ని ప్రయోగాత్మక పాత్రలకు స్ఫూర్తినిచ్చేలా ఉంది.

హీరోను అంధుడిగా.. వికలాంగుడిగా.. కురూపిగా చూపించాలంటే తమిళ దర్శకులకే చెల్లు. మన హీరోలు మాత్రం ఆ తరహా పాత్రలంటే భయపడిపోయేవాళ్లు. మామూలు హీరోలు కూడా ఆ తరహా పాత్రకు వెనుకాడేవాళ్లు. ఇక స్టార్ హీరోలైతే చెప్పాల్సిన పని లేదు. ఐతే గత కొన్నేళ్లలో తెలుగు సినిమా తీరు మారింది. మాస్ మసాలా కథలకు కాలం చెల్లి.. వైవిధ్యమైన కథలకు పట్టం పడుతున్నారు. దర్శకులు మారారు.. హీరోలు మారారు.. ప్రేక్షకులూ మారారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పాత్రకైనా హీరోలు రెడీ అనే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో ఊపిరి సినిమాలో ఆద్యంతం కుర్చీకి అతుక్కుపోయే పాత్ర చేశాడు. ప్రేక్షకులు ఆ పాత్రను.. సినిమాను ఆదరించారు. ఈ స్ఫూర్తితో మిగతా హీరోలు.. దర్శకులు కూడా సాహసాలకు సిద్ధమవుతున్నారు.

ఎప్పుడూ మాస్ మసాలా సినిమాలు చేసే రవితేజ.. ఇప్పుడు అంధుడి పాత్రకు సై అనడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అతను కథానాయకుడిగా రాజా ది గ్రేట్ అనే సినిమా మొదలైంది. వెల్కం టు మై వరల్డ్ అంటూ అంధుడిగా స్టిక్ పట్టుకుని ఫస్ట్ లుక్ పోస్టర్తో షాకిచ్చాడు మాస్ రాజా.

,  ,  ,  ,  ,