Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 14:22:16
facebook Twitter Googleplus
Photo

పవన్‌కళ్యాణ్‌ ఒకప్పుడు యూత్‌ ఆలోచనలకి దగ్గరగా వుండే సినిమాలు చేసే వాడు. అప్పుడు యువతకి ఏం కావాలనేది బాగా స్టడీ చేసిన పవన్‌ తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీలాంటి చిత్రాలతో వారికి ఒక ఐకాన్‌లా మారిపోయాడు. అయితే అదే పవన్‌కళ్యాణ్‌కి ఇప్పుడు యూత్‌ పల్స్‌ తెలీడం లేదు. దీనికి కారణం అతను ప్రపంచంతో సంబంధాలు కట్‌ చేసుకుని తనదైన ప్రపంచంలో వుండడమే కారణమని అంటున్నారు. సినిమా హీరోలెప్పుడూ ట్రెండుని ఫాలో అవుతుండాలి. కానీ పవన్‌ తీరిక సమయాన్ని అంతా రాజకీయాల అధ్యయనానికే కేటాయిస్తున్నాడు. దీంతో వేరే సినిమాలు ఎలా వుంటున్నాయనేది తెలుసుకునే తీరిక వుండడం లేదు. ఎక్కువ మందితో పరిచయాలు కూడా లేకపోవడంతో అతడినెవరూ తమ సినిమా ప్రదర్శనకి ఆహ్వానించరు. అలా పవన్‌కళ్యాణ్‌కి ట్రెండ్‌ ఏంటన్నది తెలీడం లేదు.

అందుకే 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని అలాంటి నాసిరకం కథతో తయారు చేసి పైగా ఆ కథని వెనకేసుకొచ్చాడు. ఏ కమర్షియల్‌ సినిమా చూసినా కానీ కథలు ఇలాగేగా వుండేదని కూడా అన్నాడు. ఇక్కడితో ఆగడం లేదు. తన తదుపరి చిత్రానికి ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన లవ్‌స్టోరీని ఓకే చేసాడు. ఫ్యాక్షన్‌ సినిమాలకి కాలం చెల్లిపోయి జమానా అవుతోంది. కానీ పవన్‌కి ఈ సంగతి తెలిసినట్టు లేదు. ఇంతగా అవుట్‌ డేట్‌ అయిన పవన్‌కళ్యాణ్‌ అప్‌డేట్‌ అయ్యే సూచనలే కనిపించడం లేదని వీరాభిమానులే నిట్టూర్పులు విడుస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,