Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 11:14:20
facebook Twitter Googleplus
Photo

చెన్నై బ్యూటీ త్రిష ఇప్పుడు బాగా స్లో అవక తప్పనిసరి పరిస్థితి. లీడ్ హీరోయిన్ గా ఆఫర్లు రావడం లేదు.. పోనీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో అయినా సత్తా చాటదామంటే.. నాయకిని జనాలు తిప్పికొట్టేశారు. ఇక రాబోయే మోహిని సంగతి అయినా ఏమవుతుందో అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైమ్ లో త్రిషకు.. చీకట్లో చిరుదివ్వె టైపులో ఓ బాలీవుడ్ సినిమా కనిపించినట్లుంది.

'యే దిల్ హై ముష్కిల్ kick ass ట్రైలర్.. kick ass ట్రాక్.. kick ass పాటలు' అంటూ ట్వీట్ పెట్టిందీ సీనియర్ సుందరాంగి. రణబీర్ కపూర్.. ఐశ్వర్యా రాయ్.. అనుష్క శర్మలు నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. 40+ అయినా సరే.. కుర్ర హీరోతో తెగ రొమాన్సులు చేసేసిన ఐష్ మనకు ఆ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు త్రిషకు యే దిల్ హై ముష్కిల్ kick ass అనిపించడానికి కారణం ఇదే అనుకుంటున్నారు చాలామంది.

ముదురు హీరోయిన్ అయిపోయినా.. ఇంకా కుర్రాళ్లతో రొమాన్స్ చేసే కేరక్టర్లలో ఇరగదీస్తున్న ఐశ్వర్యారాయ్ టైపులో.. తను కూడా ఇరగదీయగలనని ఇన్ డైరెక్టుగా మెసేజ్ లు ఇస్తోందని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. లేకపోతే.. ఒక ట్రైలర్ నచ్చితే మరీ మూడు సార్లు కిక్కాస్ అనాల్సిన పని పెద్దగా ఏముండదు కదా

,  ,  ,  ,  ,  ,