త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమ అభిమాన కథానాయకుడు నటిస్తే చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి కోరిక తీరబోతోంది. ఇటీవల 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాన్ని తీసిన త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయడానికి డిసైడ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మహేష్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సివుంది. అయితే, ఆ ప్రాజక్టు లేటయ్యేలా ఉండడంతో, ఎన్టీఆర్ తో ప్రాజక్టును ముందుకుతెస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది పూర్తి కాగానే త్రివిక్రమ్ ప్రాజక్టును ఎన్టీఆర్ చేస్తాడని సమాచారం.
ntr, trivikram, news, tollywood,