Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2016 12:27:26
facebook Twitter Googleplus
Photo

అ..ఆ.. చిత్రంతో త్రివిక్రమ్ అందుకున్న విజయం సామాన్యమైనది కాదు. తన పేరు తనపై ఆడియన్స్ ఉంచిన నమ్మకం తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారనే క్లారిటీతో.. స్టార్ కాస్టింగ్ లేకుండానే.. గ్రాండ్ సక్సెస్ సాధించాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడీ మూవీ ప్రమోషన్స్ విషయంలోనూ జాగ్రత్తగానే ఉంటున్నాడు. అ..ఆ.. డ్రీమ్ రన్ ను కంటిన్యూ అయ్యేలా స్టెప్స్ తీసుకుంటున్నాడు. పైగా కొన్ని ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేయడంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఫాలో అయిపోతున్నాడు.

సాధారణంగా తన సినిమాల కోసం బన్నీ ఏం చేసినా రెండు తెలుగు రాష్ట్రాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఒక చోట ఆడియో ఫంక్షన్ చేస్తే - రెండో ప్రాంతంలో సక్సెస్ మీట్ అంటాడు. ఇలాంటి స్ట్రాటజీని సన్నాఫ్ సత్యమూర్తి రుద్రమదేవి - సరైనోడు.. అన్ని చిత్రాలకు అనుసరించాడు. విజయవాడ - వైజాగ్ లతో పాటు ఏపీలోని ఇతర నగరాల్లో కూడా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తూ ఉంటాడు. ఇప్పుడిదే పద్ధతిని త్రివిక్రమ్ కూడా ఫాలో అయిపోతున్నాడు.

అ..ఆ.. చిత్రానికి గాను సక్సెస్ మీట్ లను విశాఖ - విజయవాడల్లో నిర్వహించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ నెల 12న గుంటూరులోని పబ్లిక్ గ్రౌండ్ ఓ గ్రాండ్ సక్సెస్ మీట్ జరగబోతోంది. మొత్తం యూనిట్ అంతా ఈ ఫంక్షన్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ జనాలు.. రెండు తెలుగు రాష్ట్రాలను బాగానే బ్యాలెన్స్ చేస్తున్నారు కదూ.

,  ,  ,  ,  ,  ,  ,