Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2016 15:13:44
facebook Twitter Googleplus
Photo

చియాన్ విక్రం చాలా కాలం తర్వాత ఇంకొక్కడుతో సక్సెస్ టేస్ట్ చేశాడు. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే.. వరుసగా 3 సినిమాలు చేసేసి స్పీడ్ చూపించబోతున్నాడని ఇప్పటికే చెప్పుకున్నాం. వీటిలో వాలు ఫేమ్ విజయ్ చందర్ తీయనున్న మూవీ కూడా ఉంది. ఈ మూవీకి సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చినా.. హీరోయిన్ ఎవరన్న సంగతి ఇప్పుడే రివీల్ అయింది.

ఇప్పుడీ మూవీలో సాయి పల్లవిని ఫైనల్ చేశారని వార్తలు తెలుస్తోంది. సిటీ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్టెయినర్ గా రూపొందే ఈ చిత్రంలో.. హీరోయిన్ రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందిట. పెర్ఫామెన్స్ తో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుందని.. చియాన్ కు ఈమె సరైన జోడీ అని భావించడంతో ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది.

మలయాళ ప్రేమమ్ లో మలర్ టీచర్ గా కుర్రకారును కట్టిపడేసిన సాయి పల్లవి.. ఆ తర్వాత తన చదువులపై దృష్టి పెట్టింది. తన డాక్టరేట్ కంప్లీట్ చేసి.. ఇప్పుడు డాక్టర్ సాయిపల్లవి అయిపోయింది. ఇందుకోసం కొన్ని ఆఫర్లను కాదనుకున్నా.. స్క్రిప్ట్ ప్రకారం చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటోంది. కార్తితో మణిరత్నం తీయనున్న మూవీ కాట్రు వెలియిదాల్ చిత్రంలో చేసేందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత కథ మారడంతో నో చెప్పింది. ప్రస్తుతం తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఫిదాలో నటిస్తుండగా.. ఇప్పుడు చియాన్ విక్రమ్ ను ఫిదా చేసేయాలని ఫిక్స్ అయిపోయింది.

,  ,  ,  ,  ,