Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2017 13:45:55
facebook Twitter Googleplus
Photo

లై ఆడియో వేడుకలో నితిన్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ ను గురూజీ గురూజీ అని పిలవడం గమనించే ఉంటారు. ఏదో మాట వరసకు గురూజీ అనడం కాదు.. త్రివిక్రముడిని నిజంగానే గురువులా భావిస్తున్నాడట నితిన్. పోయినేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ చేసిన అఆ సినిమా అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి త్రివిక్రమ్ సలహా మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నాడట నితిన్. అఆ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియక ఆరు నెలలు ఖాళీగా ఉండిపోయిన నితిన్.. చివరికి ఈ గందరగోళానికి త్రివిక్రమ్ సాయంతోనే తెరదించాడట. ఆయన సలహాతోనే లై సినిమా చేశాడట.

అఆ తర్వాత ఆర్నెల్ల పాటు చాలా గందరగోళంలో ఉన్నా. ఏ సినిమా చేయాలో అర్థం కాలేదు. అలాంటపుడు త్రివిక్రమ్ గారి దగ్గరికే వెళ్లాను. హిట్టిచ్చారు కానీ.. ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలో తేల్చుకోలేకపోతున్నా అన్నాను. దీంతో ఆయన ఇష్క్ దగ్గర్నుంచి సున్నితమైన ప్రేమకథలే చేస్తున్నా కాబట్టి.. ఈ సారి అలాంటి సినిమా వద్దన్నారు. కొంచెం భిన్నంగా ప్రయత్నించమన్నారు. అలాంటి సమయంలోనే హను లై కథ చెప్పాడు. ఈ కథ విన్న అరగంటకే ఓకే చెప్పేశా. అంత బాగా నచ్చింది. నాకు కథ ఎలా చెప్పాడో.. అంత కంటే బాగా తెరకెక్కించాడు హను.

,  ,  ,  ,  ,  ,