Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2017 10:26:09
facebook Twitter Googleplus
Photo

పరిశ్రమలో ఎందరో కష్టజీవులు శ్రమిస్తూ ఉంటారు. అయితే తెరవెనుక పని చేసే చాలామందికి గుర్తింపు దక్కదు. ఎంతో కష్టపడితేగాని పైకి రాలేరు. అంతే కాకుండా సినిమాల్లో రాణించాలంటే కాస్త అదృష్టం కూడా ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఓపిక మరియు అవమానాలను భరించాలి. అయితే సాధారణంగా తెర వెనుక ఎక్కువ కష్టపడేది పురుషులే. చాలా తక్కువగా లేడి రచయితలు దర్శకులు కనిపిస్తారు.

అయితే ఈ తరహా ధోరణిపై కోలీవుడ్ హీరో సూర్య సతీమణి నటి జ్యోతికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ మాత్రం ఆలోచించకుండా అమ్మడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె చేసింది అక్కడి చిత్ర పరిశ్రమపై. ఆమె ఏం చెప్పిందంటే.. ప్రస్తుతం సినిమా పరిశ్రమల్లో పురుషాధిక్యత చాలానే ఉంది అంటూ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. హీరోల సినిమాలపై స్పందిస్తూ.. హీరోలు నటించే ఎంత చెత్త సినిమా అయినా నాలుగైదు రోజులకంటే ఎక్కువా రోజులు ఆడవు. అదే హీరోయిన్ కరెక్ట్ గా ఒక మంచి కథతో సినిమాను తెరకెక్కిస్తే వారం రోజుల తర్వాతే వసూళ్లను రాబడుతుందని చంద్రముఖి కన్నెర్ర జేసింది.

ఇక మహిళ దర్శకుల గురించి మాట్లాడుతూ.. రచయితల ప్రాముఖ్యత తక్కువే అని చెబుతూ అవకాశం ఇస్తే మహిళలు మంచి సినిమాలను తెరకెక్కిస్తున్నారని చెప్పింది. అందుకు ఉదాహరణగా సుధా కొంగర మాధవన్ తో తెరకెక్కించిన ఇరుదుసుత్త్రు(గురు) అని కూడా జ్యోతిక వివరించింది.

,  ,  ,  ,  ,