Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2017 12:18:49
facebook Twitter Googleplus
Photo

కథలను కూడా ఆద్యంతం ఆసక్తికరంగా చూసేలా తీర్చిదిద్ది ప్రేక్షకులను మెప్పించడం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్పెషాలిటీ. అతడి పెన్ పవర్ కు.. టేకింగ్ కు స్టార్ ఇమేజ్ తోడయితే సినిమా ఏ రేంజి హిట్ సాధిస్తుందో అత్తారింటికి దారేది సినిమా ప్రూవ్ చేసింది. సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానులను ఆశించిన స్థాయిలో మెప్పించక పోవడంతో మరోసారి తన ఫ్రెండయిన త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే ఇంకో సినిమా చేసేందుకు పవన్ రెడీ అయ్యాడు.

ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి నాటికి థియేటర్లకు తీసుకురావాలని డైరెక్టర్ త్రివిక్రమ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రస్తుతానికి అజ్ఞాతవాసి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కీర్తి సురేష్ - అను ఇమ్మానుయేల్ పవన్ తో ఆడి పాడనున్నారు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణాన షూటింగ్ గ్యాప్ లో పవన్ కాఫీ సిప్ చేస్తుండగా త్రివిక్రమ్ ఓ సెల్ఫీ తీసి దానిని షేర్ చేశారు. ఇందులో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ చిరునవ్వుతో స్టిల్ ఇచ్చింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతకు తగ్గట్టుగానే స్టయిలిలష్ అవుట్ ఫిట్స్ తో ఇంప్రెసివ్ గా కనిపిస్తున్నాడు.

త్రివిక్రమ్ డైరెక్షన్ కు ఓ రకంగా సొంత బ్యానర్ లాంటి హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తొలిసారి పవన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

,  ,  ,  ,  ,