Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2015 11:16:36
facebook Twitter Googleplus
Photo

వ్యతిరేకతలు .. కోర్టు కేసులు ... 'ఉత్తమ విలన్' ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో ముందుగా ప్రకటించినట్టుగా ఈ సినిమా మే 1న విడుదలవుతుందో లేదోననే వార్తలు పెద్ద ఎత్తున షికారు చేశాయి. ఈ సినిమాలో స్పర్శించిన కొన్ని అంశాల పట్ల విశ్వహిందూ పరిషత్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కోర్టుకి వెళ్లింది. ఆ అంశాలను పరిశీలించిన కోర్టు సోమవారం రోజున ఈ కేసును కొట్టేసింది.

మద్రాసు హై కోర్టు తీర్పు ఈ సినిమాకి అనుకూలంగా రావడంతో, అనుకున్న ప్రకారం మే 1న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు జరుపుతున్నాడు. రమేష్ అరవింద్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో, కమల్ సరసన పూజాకుమార్ .. ఆండ్రియా .. పార్వతీ మీనన్ కనిపిస్తారు. విభిన్నమైన కథాంశంతో .. భారీబడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వాళ్ల అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందనేది చూడాలి.

,  ,  ,  ,  ,